
విజయ్ సేతుపతి నటించిన చిత్రాల్లో విక్రమ్ మూవీ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో విజయ్ సేతుపతితోపాటు ఫహద్ ఫాజిల్ నటించారు. అలాగే ఇందులో సూర్య గెస్ట్ రోల్ పోషించారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు భార్యలు ఉంటారు. అందులో పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒకరు.

విజయ్ సేతుపతి పక్కన కూర్చోడానికి గొడవ చేస్తే.. గుండె ఎడమవైపు ఉంటుంది అందుకే నిన్ను ఎడమవైపు కూర్చోబెట్టుకున్నా అని డైలాగ్ కొడతాడు. ఈ డైలాగ్ నెట్టింట చాలా ఫేమస్.

ఆమె పేరు మహేశ్వరి చాణక్యన్. తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వీజే గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది ఈ వయ్యారి.