- Telugu News Photo Gallery Cinema photos Malli Serial Actress Bhavana Lasya Beautiful Photos Goes Viral
Tollywood: సీరియల్లో సింపుల్గా.. నెట్టింట హాట్ అటామ్ బాంబ్లా.. ఫోటోస్ వైరల్..
బుల్లితెరపై సీరియల్ హీరోయిన్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం టీవీల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరై మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇంతకీ ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?
Updated on: Jan 24, 2025 | 9:11 PM

సీరియల్లో సింపుల్ గా చీరకట్టులో కనిపించింది. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే కొన్ని రోజులుగా తన సీరియల్ నుంచి తప్పుకున్న ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ?

స్టార్ మాలో మల్లి సీరియల్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో మల్లి పాత్రలో నటించిన లాస్య తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అచ్చమైన తెలుగుమ్మాయిగా పద్దతికి చీరకట్టినట్లుగా కనిపిస్తుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా డిఫరెంట్. ఎంతో మోడ్రన్ గా, గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. నిత్యం నెట్టింట ఏదోక క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ మోడ్రన్ డ్రస్సుల్లో ఫోటోలు వదిలింది. గ్లామర్ డ్రెస్సులలో వారెవ్వా అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది లాస్య. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడి 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

చాలా రోజులుగా మల్లి సీరియల్లో లాస్య కనిపించడం లేదు. సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత నెట్టింట చాలా యాక్టివ్ అయ్యింది. ఈ అమ్మడు యాక్టింగ్, లుక్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.





























