- Telugu News Photo Gallery Cinema photos Do you remember heroine in this Childhood photo.. She is actress shriya saran
స్కూల్ డ్రస్‌లో ఉన్నఈ క్యూటీని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీని షేక్ చేసిన హాట్ బ్యూటీ ఆమె
ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఫోటోలు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో వైరల్ అవుతుంది. ఆమెను గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ ఆమె..
Updated on: Sep 11, 2024 | 11:06 AM

ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఫోటోలు కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో వైరల్ అవుతుంది. ఆమెను గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ ఆమె..

పై ఫొటోలో ఉన్నది ఎవరో కాదు. అందాల భామ శ్రియ. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హరిద్వార్‌లో పుట్టి పెరిగిన శ్రియ ప్రొఫిషనల్ కథక్, రాజస్థానీ నృత్యకారిణి. ఎన్నో డ్యాన్స్ షోలలో పాల్గొంది ఈ బ్యూటీ . అలా డ్యాన్స్ షోలో పాల్గొంటున్న సమయంలోనే రామోజీ ఫిలింస్ తమ సినిమాలో నటించమని శ్రియ కు ఛాన్స్ ఇచ్చారు.

తెలుగు సినిమా ‘ఇష్టం’ సినిమా ద్వారా తొలిసారిగా చిత్ర పరిశ్రమకు పరిచయమంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోలవరకు అందరి సరసన నటించింది.

శ్రియ తమిళం అలాగే తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ , ప్రభాస్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి ఇళయదళపతి విజయ్, విక్రమ్, ధనుష్, విశాల్, జయం రవి వరకు ఎందరో స్టార్ హీరోలకు హీరోయిన్‌గా నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శ్రియ. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది ఈ అమ్మడు. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో మాత్రమే నటిస్తుంది. .




