
చాలా మంది హీరోయిన్స్ వ్యాపారవేత్తలను, లేదా స్పోర్ట్స్ పర్సన్స్‌ను పెళ్లిచేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమా వాళ్లనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్స్ దర్శకులను, హీరోలను పెళ్లి చేసుకున్నారు.

ఓ అందాల భామ కూడా ఎంతమంది కోటీశ్వరుల సంబంధాలు వచ్చిన వొద్దని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో రాణించింది ఆ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అప్పట్లో ఆమె ఓ సంచలనం.. కుర్రాళ్ళ కలల రాకుమారి ఆ ముద్దుగుమ్మ.

ఆమె సినిమా వస్తుందంటే ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ రాశి. ఒకప్పుడు ఈ అమ్మడు పేరు సెన్సేషన్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. రావు గారి ఇల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ.

రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుల సంబంధాలు ఎన్ని వచ్చినా నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. శ్రీముని అలియాస్ ఎస్.ఎస్. నివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి. రాశి నటించిన సినిమాలకు శ్రీముని అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందట.

ఆ తర్వాత రాశి తండ్రి చనిపోయారు.. ఆసమయంలో శ్రీముని మోరల్ సపోర్ట్ గా ఉన్నాడట.. ఆతర్వాత రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో చాలా కోటీశ్వరుల, వ్యాపారవేత్తల సంబంధాలు వచ్చాయట.. అయితే తనకు శ్రీముని నచ్చడంతో అతనికి డైరెక్ట్ గా చెప్పి పెళ్లి చేసుకుందట. తన లవ్ స్టోరీని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి.