
చాలా వరకు కొంత మందికి ఫెవరెట్ హీరో, హీరోయిన్స్ అనే వారుంటారు. అయితే మన జక్కన్నకు కూడా ఓ హీరోయిన్ ఫేవరెట్ అంట. ఆ నటి నటనకు తాను ఫిదా అయిపోయాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరా అనేగా మీరు ఆలోచిస్తుంది. తెలుసుకుందాం పదండి మరి !

ఇప్పటికీ రాజమౌళి చాలా మంది నటీ నటులతో కలిసి పని చేశారు. ముఖ్యంగా ఈయన చాలా మంది సీనియర్ హీరోయిన్లతో సినిమాలు తీసిన విషయం తెలిసిందే. అయితే వారందరినీ కాదు అని ఈ దర్శకుడికి ఓ యంగ్ హీరోయిన్ నటన చాలా బాగా నటచ్చిందంట. ఆ మొదటి మూవీ చూసి తన నటనకు ఫిదా అయపోయాడంట. అప్పటి నుంచి ఆమె తన ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిందంట.

ఆమె ఎవరో కాదు, కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీల్లో ఒక్కటైన రాజన్న సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అక్కి. ఈ చిన్నది రాజన్న మూవీలో ఎంత బాగా యాక్టింగ్ చేసిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. మల్లి పాత్రకు ప్రాణం పోసి ఈ చిన్నారి.

రాజన్న సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు రాజమౌళి దర్శకత్వం వహించాడు. కాగా చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అనీ నటనకు తను ఫిదా అయినట్లు జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సినిమాలోని ఓ పెద్ద సీన్ పెద్దవాళ్ళు కూడా కష్టంగా నటిస్తారు.కానీ ఆ సీన్ చిన్నారి చాలా ఈజీగా చేసేసింది. కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్ల కాదు.. కానీ ఆ అమ్మాయి కళ్ళతోనే ఎమోషన్స్ పండించేసింది. దీంతో ఆ అమ్మాయి నటనకు నేను ఫిదా అయిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.