
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ కు పోటీ ఇచ్చింది. అచ్చం ఐష్ కు జీరాక్స్ కాపీలా ఉన్న ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుందని అనుకున్నారంతా. అలా జరగలేదు.

2005లో సినీరంగలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీని చూసి అందరూ జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. 2005 లో లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఆమెను చూసి ఐశ్వర్య లేదా ఆమె సోదరి అనుకున్నారు. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ స్నేహా ఉల్లాల్.

2007లో విడుదలైన నేను మీకు తెలుసా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో మంచు మనోజ్ హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తర్వాత కరెంట్ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన సింహా మూవీలో కనిపించిన స్నేహా చివరగా 2011లో మడత కాజా అనే చిత్రంలో కనిపించింది.

గతంలో తన అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టి అభిమానులకు షాకిచ్చింది. తనకు రక్త సంబంధిత ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందని, దీనివల్ల ఆమె రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించిందని ఆమె స్వయంగా తన పరిస్థితి గురించి వివరాలను వెల్లడించింది. ఆమె 30 నిమిషాలు నిలబడటం కూడా కష్టమైందని తెలిపింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.