34 ఏళ్ల తమన్నా ఇప్పటివరకు దాదాపు 67 సినిమాల్లో నటించింది. 2005లో, ఆమె తొలిసారిగా 'ఇండియన్ ఐడల్' విజేత అభిజిత్ సావంత్ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అదే ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు 'చాంద్ స రోషన్ చెహ్రా'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.