- Telugu News Photo Gallery Cinema photos Super Star Rajinikanth planning multi starrer consecutively with Thalaivar with lokesh kanagaraj Telugu Entertainment Photos
Rajinikanth: వరుసగా మల్టీ స్టారర్లు ప్లాన్ చేస్తున్న తలైవా.! లియో షూటింగ్ లో విక్రమ్ కాల్.
టాప్ హీరోల మధ్య పోటీ ఉంటుందా? ఉంటే అది హెల్దీగానే ఉంటుందా? మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, ఎప్పుడూ స్టేజ్‌ల మీద హ్యాపీగా కనిపించే తలైవర్‌కీ, లోక నాయకుడికీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది.? విజయ్ నటించిన లియో షూటింగ్‌లో సమయంలో ఏం జరిగింది? రజనీ - కమల్ గురించి లోకేష్ చెప్పిన ఆ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటి.? కమాన్ లెట్స్ వాచ్.. లియో సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే, కలెక్షన్లు చూస్తే కడుపునిండిపోయిందని అంటున్నారు లోకేష్ కనగరాజ్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 21, 2023 | 9:50 PM

టాప్ హీరోల మధ్య పోటీ ఉంటుందా? ఉంటే అది హెల్దీగానే ఉంటుందా? మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, ఎప్పుడూ స్టేజ్‌ల మీద హ్యాపీగా కనిపించే తలైవర్‌కీ, లోక నాయకుడికీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది.? విజయ్ నటించిన లియో షూటింగ్‌లో సమయంలో ఏం జరిగింది? రజనీ - కమల్ గురించి లోకేష్ చెప్పిన ఆ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటి.? కమాన్ లెట్స్ వాచ్..

లియో సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా సరే, కలెక్షన్లు చూస్తే కడుపునిండిపోయిందని అంటున్నారు లోకేష్ కనగరాజ్. అంతే కాదు, లియో సమయంలో జరిగిన ఎన్నో విషయాలు ఆయన లైఫ్‌లో గుర్తుండిపోతాయట.

కశ్మీర్‌లో లియో షూటింగ్ జరుగుతుండగానే, తలైవర్ రజనీకాంత్‌కి నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ నెరేట్ చేశారట లోకేష్. కమల్‌హాసన్‌తో లోకేష్ చేసిన విక్రమ్‌కి ఐదు రెట్లు గొప్పగా ఉంటుందట ఈ సబ్జెక్ట్.

తలైవర్ కథ వినగానే లేచి వచ్చి లోకేష్‌కి టైట్ హగ్ ఇచ్చారట. ఇలాంటి సబ్జెక్ట్ కోసం ఇన్నాళ్లూ చూస్తున్నా అని రజనీ కాంత్ అనగానే లోకేష్ నోటి వెంట మాట రాలేదట. ఆ విషయాన్ని అనుకుంటూ తనలో తాను ఆనందపడుతున్నప్పుడు కమల్‌హాసన్ నుంచి ఫోన్ రావడం ఆశ్చర్యానికి గురిచేసిందట.

బెస్ట్ విషెస్.. ఈ సారి అదరగొట్టు అంటూ కమల్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా అంటున్నారు లోకేష్. ప్రస్తుతం వేట్టయాన్ సినిమాతో బిజీగా ఉన్నారు రజినీకాంత్. ఆ సినిమాను పూర్తి చేయగానే వెంటనే లోకేష్ సెట్స్ కి షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమా మీద ఫోకస్ చేయడం కోసం సోషల్ మీడియాకు కూడా దూరంగానే ఉన్నారు లోకేష్. ఇప్పటిదాకా అన్ని సినిమాలకూ పూజ రోజే అనౌన్స్ మెంట్ డేట్ ఇచ్చేయడం లోకేష్‌కి అలవాటు. కానీ రజనీకాంత్ సినిమాకు మాత్రం అలా చేయడం లేదని ముందే చెప్పేశారు కెప్టెన్. లోకేష్ - రజనీ కాంబో మీద మాత్రం కోలీవుడ్‌లో బీభత్సమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి..





























