Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

Updated on: Jan 31, 2026 | 12:41 AM

బుల్లితెర సూపర్ స్టార్ అంటే ఈతరం సినీప్రియులకు ఠక్కున గుర్తొచ్చే పేరు డాక్టర్ బాబు. అలియాస్ నిరుపమ్ పరిటాల. దశాబ్దాలుగా టీవీ రంగంలో వరుస సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్మాల్ స్క్రీన్ పై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు అమ్మాయిల ఫాలోయింగ్ సైతం ఎక్కువే.

1 / 5
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దాదాపు ఏడేళ్లు ఈ సీరియల్ టాప్ నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయింది. ఇప్పుడు కార్తీక దీపం 2 సైతం అదే స్థాయిలో దూసుకుపోతుంది. ఇందులో మరోసారి డాక్టర్ బాబు సందడి చేస్తున్నారు.

2 / 5
కార్తీక దీపం 2లో కార్తీక్ పాత్రలో మరోసారి సినీప్రియులను అలరిస్తున్నారు నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. డాక్టర్ బాబు పాత్రలో నిరూపమ్ పరిటాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

3 / 5
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంది. నిరూపమ్ పరిటాల సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ నటుడు రచయిత ఓంకార్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు.

4 / 5
చంద్రముఖి సీరియల్ ద్వారా నటుడిగా సక్సెస్ అయ్యాడు నిరుపమ్. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ కోసం నిరుపమ్.. ఒక్క రోజుకు రూ.50 వేల వరకు పారితోషికం తీసుకుంటాడట

5 / 5
నిరుపమ్ ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నిరుపమ్ భార్య మంజుల సైతం నటి కావడం విశేషం. చంద్రముఖి సీరియల్ ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది