
లక్ష్మీ రాయ్.. ఈ వయ్యారి గుర్తుందా.? కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే అందాల ఆరబోతతో అదరగొట్టింది.

ఆ తర్వాత 'నీకు నాకు', 'అధినాయకుడు' లాంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే తెలుగులో ఈ సినిమాలు తప్పితే.. మరే ఆఫర్లు లేకపోవడంతో.. అటు తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించింది.

ఇక 'బలుపు', చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. వీటి క్రేజ్‌తో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ', 'సిండ్రెల్లా' , 'జనతాబార్' అనే సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది లక్ష్మీ రాయ్. అటు తమిళంలో లారెన్స్ 'కాంచన' సినిమాలో నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ వయ్యారి చేతిలో సినిమా ఆఫర్స్ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వరుసగా హాట్ ఫోటోలతో రచ్చ లేపుతోంది ఈ చిన్నది. కుర్రకారుకు హీట్ పుట్టించేలా వెకేషన్ ఫోటోలు, బికినీ స్టిల్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది లక్ష్మీ రాయ్.

కాగా, లక్ష్మీ రాయ్ చివరిగా మలయాళంలో 'DNA' సినిమాలో నటించింది. అలాగే హిందీలో 'భోళా' ఈమె చివరి చిత్రం. ఇక తెలుగులో లక్ష్మీ రాయ్‌ది 'వేర్ ఇజ్ ది వెంకటలక్ష్మీ' లాస్ట్ ఫిలిం.