
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘తమ్ముడు’ మూవీ ఒకటి. దర్శకుడు అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ మూవీకి.. టీవీలలోనూ టాప్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చింది. 1999లో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్‌తో సహా యువతను ఓ ఊపు ఊపేస్తోంది.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆ అందాల భామ మరెవరో కాదు ప్రతీ జింగానియా. ‘యే హై ప్రేమ్’ అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళ సినిమా ‘మళవిల్లు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత ‘మొహబ్బతే’ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘తమ్ముడు’ సినిమాతో పాటు ‘నరసింహనాయుడు’, ‘అధిపతి’, ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్’ లాంటి చిత్రాల్లో నటించింది. అలాగే యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

చివరిగా అల్లరి నరేష్ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. హిందీ, మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాలలో నటించింది ఈ ముద్దు గుమ్మ. 2008లో ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ పెళ్లి చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.

వీరికి జయ్‌వీర్, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఆమధ్య ఈమె భర్త ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.