
అనుష్క శెట్టి.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. సూపర్ సినిమాతో నాగార్జునతో కలిసి థియేటర్లలో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అరుంధతి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీతో నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాహుబలి సినిమాతో అనుష్క పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. ఈ సినిమాతో అనుష్కకు మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమా తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.

కొన్నాళ్లు సైలెంట్ అయిన అనుష్క.. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న సినిమా ఘాటీ. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది.

ఇదిలా ఉంటే.. అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. బాహుబలి సినిమా తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. ఈ మూవీతోపాటు ఆమెకు మరో హీరో సినిమాలో ఛాన్స్ రాగా.. సున్నితంగా రిజెక్ట్ చేసిందట.

ఆ సినిమా మరెదో కాదు.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). విజయ్ దళపతి నటించిన ఈ చిత్రానికి ముందుగా అనుష్కను ఎంపిక చేశారట. కానీ వేరే కారణాలతో అనుష్క తప్పుకోగా.. త్రిషను సంప్రదించారట. దీంతో త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోట్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.