
సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెగలు పుట్టించేసింది హీరోయిన్ నేహా శెట్టి. బంగారు వర్ణం మోడ్రన్ డ్రెస్సులో ఫోజులకు ఫోజులిచ్చింది. తాజాగా నేహా షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఆమె పోస్టులకు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో మోడ్రన్ లుక్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.

తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది ఈ క్రేజీ బ్యూటీ.

అయితే కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సైలెంట్ అయింది నేహా శెట్టి. డీజే టిల్లు తర్వాత ఒకటిరెండు చిత్రాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మత్రం ఒక్క సినిమా సైతం ప్రకటించలేదు. కేవలం కన్నడలోనే సినిమాలు చేస్తుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. అలాగే ఏదోక క్రేజీ పిక్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన పోస్టులు ఆకట్టుకుంటున్నాయి.