- Telugu News Photo Gallery Cinema photos Directors who have burden of thousands of crores on them like Sukumar, Rajamouli, Prashant Neel
టార్గెట్‌తో బరిలోకి దిగి.. వేల కోట్ల భారం మోస్తున్న టాప్ డైరెక్టర్స్
ఇది వరకు సినిమాల మార్కెట్ ఒక లెక్క అయితే ప్రస్తుత సినిమాల మార్కెట్ ఒక లెక్క అని చెప్పాలి.. పూర్వం సినిమా మార్కెట్ హీరో ఇమేజ్ ను బట్టి ఉండేవి.. అయితే ప్రస్తతం భారం అంతా దర్శకుల మీద పడుతుంది.. పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తున్న దర్శకులు, ఆ రేంజ్ వసూళ్లు సాధించిన బాధ్యతకు మోస్తున్నారు.. అంతే కాకుండా వేల కోట్ల టార్గెట్ తో రేస్ లోకి దిగుతున్నారు.. ఆ దర్శకులు ఎవరో మీరు ఓ లుక్ వేయండి
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 24, 2024 | 6:05 PM

ఇన్నాళ్లు సినిమాల మార్కెట్ లెక్కలు హీరోల ఇమేజ్‌ను బట్టి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ భారం దర్శకుల మీద కూడా పడుతోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తున్న దర్శకులు, ఆ రేంజ్ వసూళ్లు సాధించిన బాధ్యతకు మోస్తున్నారు. అలా వేల కోట్ల టార్గెట్‌తో బరిలో దిగుతున్న దర్శకుల మీద ఓ లుక్కేద్దాం.

భారీ బడ్జెట్ సినిమా అంటే ముందు రాజమౌళి గురించే మాట్లాడుకోవాలి. బాహుబలి తరువాత ఒక్కో సినిమాకు బడ్జెట్ డబుల్ చేసుకుంటూ పోతున్న జక్కన్న, నెక్ట్స్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను దాదాపు రెండు వేల కోట్లతో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అంటే ఆ స్థాయిలో రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది.

రాజమౌళి తరువాత రెండు వేల కోట్ల రేంజ్ భారం మోస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు రెడీ అవుతున్న నీల్, సలార్ 2ను కూడా లైన్‌లో పెట్టారు. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న ప్రాజెక్ట్సే కావటంతో ప్రశాంత్ మీద కూడా ఫ్యాన్స్ ఒత్తిడి గట్టిగా కనిపిస్తోంది.

రెండు వేల కోట్ల రేంజ్ కాకపోయినా... ఖచ్చితంగా 12, 13 వందల కోట్ల వసూళ్లు సాధించాల్సిన సిచ్యుయేషన్‌లో ఉన్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతోంది. ఆల్రెడీ 1000 కోట్ల బిజినెస్ జరిగిందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. అంటే కచ్చితంగా అంతకు మించి వసూలు చేయాల్సిన ప్రెజర్ సుకుమార్ మీద ఉంది.

సౌత్‌లో ఇంత మంది దర్శకుల పేర్లు వినిపిస్తుంటే... నార్త్‌లో మాత్రం ఈ సెగ్మెంట్‌లో ఒక్క అయాన్ ముఖర్జీ మాత్రమే కనిపిస్తున్నారు. బ్రహ్మాస్త్రతో బిగ్ హిట్ అందుకున్న అయాన్, ప్రజెంట్ హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న అయాన్, వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ దాటించాల్సిన బాధ్యత తీసుకున్నారు.





























