
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే అందుకు కారణం కథను కావాలని సాగతీయటమే అన్న విమర్శలు వినిపించాయి.

ఒకే భాగంగా ప్లాన్ చేసిన కథను సినిమా లెంగ్త్ ఎక్కువగా వచ్చిందని పార్ట్ 2, పార్ట్ 3 అని రెండు సినిమాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు శంకర్. శంకర్ నిర్ణయంతో పార్ట్ 2లో అసలు కథే లేకుండా పోయింది. దీంతో భారతీయుడు 2 డిజాస్టర్ అయ్యింది.

ఇప్పుడు విడుదలై 2 విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా ఫైనల్ కట్ నాలుగున్నర గంటలకు పైగా రావటంతో పార్ట్ 3 ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు దర్శకుడు వెట్రిమారన్.

ఎలాగూ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది కాబట్టి రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే వసూళ్ల పరంగా డబుల్ బెనిఫిట్ ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు విడుదలై 2 మూవీ మేకర్స్.

కానీ విజయ్ సేతుపతి మాత్రం పార్ట్ 3 విషయంలో అంత ఇంట్రస్ట్ చూపించటం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో విడుదలై 2 మాత్రమే వస్తుందా, పార్ట్ 3 కూడా ఉంటుందా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.