
పుష్ప క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్. ముఖ్యంగా పుష్ప అనే పేరు ఎక్కువగా మహిలళకు ఉంటుంది. కానీ డైరెక్టర్ హీరోనే స్మగ్లర్ చేసి, ముఖ్యంగా తనకు పుష్ప అనే పేరు పెట్టడం అనేది సరికొత్త కాన్సెప్ట్. అయితే పుష్ప సినిమాలో ఇలా అల్లు అర్జున్ కు పేరు పెట్టడం వెనుక ఓస్మగ్లర్ ఉన్నారంటున్నారు దర్శకుడు సుకుమార్.

ఆయన తాజాగా ఓ ఈ వెంట్ లో పాల్గొని పుష్ప సినిమాకు సంబంధించిన షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేశారు. సుకుమార్ మాట్లాడుతూ.. నేను పుష్ప సినిమా తీయాలి అనుకున్నప్పుడు పుష్ప రాజ్ అనే ఓస్మగ్లర్ ను కలిశాను. తనను కలవడం చాలా బాగా అనిపించింది.

ముఖ్యంగా అతని పేరు పుష్ప రాజ్ కావడంతో , ఇది ఆడవారి పేరు, కానీ ఓ స్మగ్లర్ ఇలాంటి పేరు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఆ పేరు నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. కాసేపు తనను ఇంటర్వ్యూ చేశాను.

అలా తన పేరు నాకు కొత్తగా అనిపించడంతో, ఆ స్మగ్లర్ కారణంగా పుష్ప సినిమా చేశాను, అంటూ పుష్ప మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సుకుమార్ త్వరలో రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నట్లు సమాచారం.