ఒకరేమో ట్రిపుల్ ఆర్‌తో వరల్డ్ వైడ్ అట్రాక్షన్ తెచ్చుకుని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. మరొకరేమో విక్రమ్ మూవీతో మరోసారి సత్తా చూపించి, మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అనిపించుకుంటున్నారు. ఒకరికి ఇద్దరినీ, ఒకేసారి, రెండు సెట్స్ లో డీల్ చేయడం మామూలు విషయం కాదు.
డబుల్ టెన్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు శంకర్ కన్నా బాగా చెప్పగలిగిన వాళ్లు ఉండరేమో.! సామాజిక స్పృహ ఉన్న సినిమాలు తీయడంలో దిట్ట డైరక్టర్ శంకర్. కమర్షియల్ వేల్యూస్‌ని యాడ్ చేస్తూనే, సొసైటీని అలర్ట్ చేసే అంశాలతో సినిమాలు తీసి కోట్లు కురిపించిన ఘనత ఆయనది. ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ఇండియన్.
ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు శంకర్. అందుకే ఫారిన్ టెక్నీషియన్స్ తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
2024లో మోస్ట్ ఎక్స్ పెక్టెడ్ మూవీస్‌లో బెస్ట్ ప్లేస్‌లో ఉంది ఇండియన్2. ఆల్రెడీ విక్రమ్ సినిమాతో రీచార్జ్ అయిన కమల్‌హాసన్, ఎలాగైనా ఇండియన్2తో ఆస్కార్ రేసులో నిలుచునే తీరాలనే సంకల్పంతో ఉన్నారు. దానికి తగ్గట్టే ఎఫర్ట్ పెట్టి మూవీ చేస్తున్నారు.
తిరిగి సెట్‌లో అడుగుపెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్యే తండ్రి పోస్ట్‌కు ప్రమోట్ అయిన చెర్రీ, షార్ట్ బ్రేక్ తరువాత కెమెరా ముందుకు వచ్చేశారు. ఇప్పటికే ఆలస్యం కావటంతో గేమ్ చేంజర్ వర్క్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
రామ్‌చరణ్, కియారా నటిస్తున్న గేమ్ చేంజర్ నాట్ జస్ట్ రొటీన్ కమర్షియల్ సినిమా. అంతకు మించి ఏదో ఉందనే హింట్స్ ఫస్ట్ నుంచీ అందుతున్నాయి. అందుకే జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు కెప్టెన్. శంకర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలైంది.
ఒకటికి రెండు మావరిక్ ప్రాజెక్టులను ఒకే ఏడాది విడుదల చేయాలన్న టెన్షన్ గతంలో ఆయనకు ఎప్పుడూ లేదు. ప్రెజర్‌లో పనిచేసినా, ఆయన ప్లెజర్‌గానే ఫీలవుతున్నారని అంటున్నారు టీమ్ మెంబర్స్. స్టార్ డైరక్టర్లకు అరుదుగా దక్కే అనుభవం ఇది అని అంటున్నారు విమర్శకులు.