- Telugu News Photo Gallery Cinema photos Director shankar daughter Aditi Shankar shared her latest photos
Aditi Shankar: క్రేజీ ఫొటోలతో కేకపుట్టించిన స్టార్ డైరెక్టర్ కూతురు.. అదితి శంకర్ లేటెస్ట్ పిక్స్
హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది. 2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది.
Updated on: Feb 04, 2025 | 8:24 PM

హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది. 2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది.

ఈ మూవీతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఇదే సినిమాలో “మధుర వీరన్” అనే సాంగ్ పాడి సింగర్ గానూ అదరగొట్టేసింది. నటిగానే కాకుండా ప్రముఖ నేపథ్య గాయని కూడా.

2022లో తెలుగు చిత్రం ‘ఘని’లో “రోమియో అండ్ జూలియట్” పాట పాడటం ద్వారా గాయనిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత మావీరన్ చిత్రంలో.. అనేక స్టేజ్ షోలలో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. నటిగా మెప్పిస్తూనే.. మరోవైపు విమర్శలను సైతం స్వీకరిస్తుంది అదితి.

ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భైరవం సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఓ వైపు చీరకట్టులో ఆకట్టుకుంటూనే.. మరో వైపు మోడ్రన్ డ్రస్సులో మెరిపిస్తుంది. తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేసింది అదితి శంకర్.