
ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న కెప్టెన్లతో పోటీ పడక్కర్లేదు. సొంత నేల నుంచి ప్యాన్ ఇండియా లెవల్లో హిట్లిచ్చిన కెప్టెన్లతో పోటీ పడాల్సిన సిట్చువేషన్‌లో ఉన్నారు కెప్టెన్ శంకర్. ఆ పోటీ కూడా డైరక్ట్ గా కాదు, ఆల్రెడీ మిగిలిన వాళ్లు చేసిన రికార్డులను టచ్ చేసి తీరాల్సిన పరిస్థితి ఆయనది. ప్యాన్ ఇండియా అనే కాన్సెప్ట్ రాకముందే సూపర్బ్ డైరక్టర్ అనిపించుకున్న శంకర్, ఇప్పుడు సమరానికి సిద్ధంగా ఉన్నారా?

నేను నార్త్ లో ప్రూవ్ చేసుకుంటే నాతో పాటు పది మంది సౌత్ ఇండియన్ టెక్నీషియన్లను ఉత్తరాది వారికి పరిచయం చేస్తానని ఓపెన్‌గానే చెప్పారు అట్లీ. అన్నట్టుగానే ఆయన జవాన్‌తో ప్రూవ్ చేసుకున్నారు. షారుఖ్ హీరోగా నటించిన జవాన్ బంపర్ హిట్‌గా ప్రూవ్ అయింది. విజయ్‌తో లోకేష్ తెరకెక్కించిన లియో కూడా ఢంకా భజాయించింది.

కాశ్మీర్ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ రూపొందించిన సినిమా లియో. విజయ్, త్రిష జంటగా నటించిన ఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాసుల వర్షం కురిపించింది. లియో2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా లియో మూవీని మెచ్చుకున్నారు. ఆయన నటించిన జైలర్‌కి ఫిదా అయినవారు కూడా కోకొల్లలు.

ఏజ్‌కి తగ్గ కేరక్టర్‌లో తలైవర్‌ని చూపించి సూపర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు నెల్సన్. సీనియర్ హీరోలు ఇలాంటి స్క్రిప్ట్ లు చేస్తే చూడ్డానికి ఎంత బావుందో అని మెచ్చుకున్నారు జనాలు. ఈ సినిమా కన్నా ముందే ప్యాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించింది పొన్నియిన్ సెల్వన్ కాన్సెప్ట్.

పొన్నియిన్ సెల్వన్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు థగ్‌లైఫ్ తెరకెక్కిస్తున్నారు మణిరత్నం.... అట్లీ, లోకేష్, నెల్సన్, మణిరత్నం... వీళ్లందరూ ప్రూవ్ చేసుకున్న చోట... ఇండియన్2తో టెస్ట్ కి సిద్ధమవుతున్నారు కెప్టెన్ శంకర్. ఇండియన్2 రిజల్ట్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద ఉంటుందన్న విషయం శంకర్‌కి కూడా బాగా తెలుసు. సో.. ఇప్పుడు డబుల్ అటెన్షన్‌తో పావులు కదుపుతున్నారు ఈ కెప్టెన్.