
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ SSMB 29. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా పలు దేశాల్లో ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రాబోతున్న ీ సినిమా గురించి ఇప్పుడు మరో న్యూస్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబును ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో చూపించనున్నారని టాక్. అలాగే ఈ సినిమా ఆఫ్రికా అడవులలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ మూవీ నుంచి టీజర్ రానున్నట్లు టాక్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రియాంక, మహేష్ బాబు ఇద్దరితో ఓ ఫోక్ సాంగ్ ఉంటుందని టాక్. ఈ మాస్ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ అందించనున్నారని.. హైదరాబాద్‌లోని విలాసవంతమైన సెట్‌లో ఈ సాంగ్ షూట్ చేస్తున్నట్లు టాక్.

దీంతో ఇప్పుడు ఈ సాంగ్ అప్డేట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఆస్కార్ విజేత కీరవాణి మహేష్, ప్రియాంక కోసం మంచి మాస్ బీట్ రెడీ చేశారని.. ఇందులో హై ఎనర్జీ జానపద పాటగా ఉంటుందని సమాచారం.