- Telugu News Photo Gallery Cinema photos Director Rajamouli may use Super Star Krishna image in SSMB29 movie with AI technology as Yamadonga Movie Senior NTR, Telugu Heroes Photos
Krishna in SSMB29: మహేష్ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ.? రాజమౌళి ఆ మజాకా నా.!
దర్శక ధీరుడు రాజమౌళి మళ్లీ పాఠాలు నేర్చుకుంటున్నారు. మహేష్ మూవీని పట్టాలెక్కించడానికి ముందే మరింత అప్‌డేట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. చేయాల్సిన మూవీని పక్కన పెట్టి మరీ జక్కన్న నేర్చుకుంటున్న ఈ కొత్త పాఠాలేంటి.? ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండున్నరేళ్లు దాటిపోయింది. అయినా రాజమౌళి నెక్ట్స్ మూవీ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. మహేష్ బాబుతో చేయాల్సిన సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నా..
Updated on: Oct 23, 2024 | 6:58 PM

దర్శక ధీరుడు రాజమౌళి మళ్లీ పాఠాలు నేర్చుకుంటున్నారు. మహేష్ మూవీని పట్టాలెక్కించడానికి ముందే మరింత అప్‌డేట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. చేయాల్సిన మూవీని పక్కన పెట్టి మరీ జక్కన్న నేర్చుకుంటున్న ఈ కొత్త పాఠాలేంటి.? ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండున్నరేళ్లు దాటిపోయింది.

మహేష్ సినిమా కోసం లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు జక్కన్న అనేది ఇప్పుడు వైరల్ న్యూస్. మా సూపర్‌స్టార్‌తో జక్కన్న చేస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయోచ్ అని సంబరపడుతున్నారు అభిమానులు.

వేట మొదలైంది అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పుడు కొత్తగా మొదలైన వేట ఏంటా అని ఆసక్తిగా చూస్తున్నారు మూవీ లవర్స్.

సినిమాల్లో భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌ను వాడటం మొదలు పెట్టింది కూడా జక్కన్నే. ఇప్పుడు కొత్తగా ఏఐ ట్రైనింగ్ తీసుకుంటుండటంతో జక్కన్న ఏం చేయబోతున్నారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.

ఇంటర్నేషనల్ స్క్రీన్స్ మీద తెలుగు సినిమాకు తిరుగులేదనే క్రెడిట్ కొట్టేయాలంటే ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని మేం కూడా అర్థం చేసుకుంటామంటూ సపోర్ట్ చేస్తున్నారు ఘట్టమనేని సైన్యం.

గతంలో యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ను తెర మీద చూపించిన జక్కన్న.. ఈ సారి మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తారా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.

ఎలాగూ మహేష్‌తో చేయబోయేది అడ్వంచరస్ యాక్షన్ డ్రామానే కాబట్టి గతంలో కృష్ణ చేసిన మొసగాళ్లకు మోసగాడు లాంటి సినిమాల్లోని పాత్రలను మళ్లీ రీ క్రియేట్ చేసే స్కోప్ ఉంటుందన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

అప్పటి వరకు ఉన్న బడ్జెట్, బిజినెస్ లెక్కలు మార్చేసిన బాహుబలి 2, ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఆ తరువాత ప్రతీ స్టార్ ఆ సినిమాను కొట్టాలన్న కసితోనే పాన్ ఇండియా మార్కెట్‌లోకి దిగుతున్నారు. కానీ ఇంత వరకు బాహుబలి రేంజ్ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద మళ్లీ రాలేదు.





























