1 / 5
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో ధనుష్. తాజాగా ఈయన తన 50వ సినిమాను ప్రకటించారు. స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే సినిమా చేస్తున్నారు ధనుష్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లెక్కన శేఖర్ కమ్ములతో చేస్తున్న సినిమా ధనుష్‌కు 51వది అన్నమాట. దీనికి ధారావి అనే టైటిల్ ప్రచారంలో ఉంది.