
చూస్తుండగానే 2024లో 3 నెలలు పూర్తి కావొస్తున్నాయి. మరో మూడు నెలలు భారీ సినిమాలేం ఉండవు. సమ్మర్‌ను ఎలాగూ మన హీరోలు వదిలేసారు. మే 9న కల్కితో అసలు పండగ మొదలవుతుందని ముందు అనుకున్నా.. ఎన్నికల కారణంగా అది వాయిదా పడేలా కనిపిస్తుంది. మరోవైపు ఆగస్ట్ 15న రావాల్సిన పుష్ప 2 రాకపై కూడా అనుమానాల పరంపరం కొనసాగుతుంది.

కల్కి షూటింగ్ పూర్తైంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇందులో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మే 9 మిస్సైతే.. కల్కికి ఆ రేంజ్ డేట్ దొరకడం కష్టమే.

ఆగష్టులో పుష్ప 2.. సెప్టెంబర్‌లో ఓజి.. అక్టోబర్‌లో దేవర వస్తున్నాయి. డిసెంబర్‌ల్ గేమ్ ఛేంజర్ అంటున్నారు. దాంతో కల్కికి ఖాళీయే లేదు. కల్కి ముచ్చట కాస్త పక్కనబెడితే.. పుష్ప 2 ఆగస్ట్ 15న వస్తుందని బల్లగుద్ధి చెప్తున్నారు మేకర్స్. కానీ ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది.

పుష్ప 2 పాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం 2 నెలలు ప్రమోట్ చేసుకోవాలి.. అంటే 2 నెలల ముందే ఔట్ పుట్ రెడీగా ఉండాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 2 షూటింగ్ లెక్కల మాస్టారు అంత వేగంగా పూర్తి చేస్తారా అనేది అసలు అనుమానం. పుష్ప 2 గానీ చెప్పిన డేట్‌కు వస్తే కల్కికి ప్రమాదమే.

ఇక మూడు ముక్కలాటలో ఉన్న మరో సినిమా గేమ్ ఛేంజర్. కనీసం కల్కి, పుష్ప 2 రిలీజ్ డేట్స్ తెలుసు.. కానీ గేమ్ ఛేంజర్‌కు అదీ లేదు.. పూర్తిగా చీకట్లో బాణమే. ఓసారి డిసెంబర్ అంటున్నారు.. మరోసారి 2025 అంటున్నారు. మొత్తానికి ఈ మూడు ముక్కలాటలో మిగిలిన సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.