Chiranjeevi: దూకుడు తగ్గించి కథలపై కాన్సంట్రేషన్ చేస్తున్న చిరు.. నెక్స్ట్ ఫిల్మ్‌తో హిట్ కొట్టేనా ??
అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి ఇదేం సినిమా కాదు. అక్కడంటే స్క్రిప్ట్ ఎలా రాసుకుంటే అలా ముందుకెళ్తుంది కథ. కానీ రియల్ లైఫ్ అలా కాదుగా.. అందుకే అనుకునేదొక్కటి అయితే.. అక్కడ జరుగుతున్నది మరోటి. పాపం చిరంజీవి విషయంలోనే ఇది రిపీట్ అవుతుంది. మరి ఆయనకు వచ్చిన కష్టమేంటి..? మెగాస్టార్ విషయంలోనే సీన్ ఎందుకు రివర్స్‌లో జరుగుతుంది..? పాపం ప్రతీ సినిమాతో సిక్స్ కొట్టాలనే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు చిరంజీవి. కానీ ఏదో ఒక సినిమా మాత్రమే బౌండరీ దాటితే.. మిగిలినవి బెడిసి కొడుతున్నాయి.