Shankar Dada MMBS: శంకర్ దాదా రీ రిలీజ్.. ఈ సమయంలో వర్కౌట్ అవుతుందా ??

| Edited By: Phani CH

Oct 18, 2023 | 1:55 PM

ఈ రోజుల్లో రీ రిలీజ్ సినిమాలు ఏ రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. స్ట్రెయిట్ సినిమాల రేంజ్ లోనే వాటిని కూడా తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. వాటి కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. లాస్ట్ ఇయర్ పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి లాంటి సినిమాలు దుమ్ము దులిపేసాయి. దాంతో అలాంటి సినిమాలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. నిర్మాతలంతా పాత సినిమాలు ఏవి మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చో లెక్కలు వేసుకుంటున్నారు. ఈ రేంజ్ లో రీ రిలీజ్ సినిమాలు ప్లాన్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు.

1 / 7

2 / 7
పాత సినిమాను 4Kలోకి మార్చడానికి దానికి మహా అయితే 20 లక్షల ఖర్చు వస్తుంది. ఒక్కరోజులోనే రిటర్న్స్ వస్తున్నాయి. అందుకని నిర్మాతలు అందరూ అటువైపు చూస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ మధ్య కాలంలో ఇలాంటి రీ రిలీజ్ సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.

3 / 7
 2023లో ఆరెంజ్, సింహాద్రి, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 7/జి బృందావన్ కాలనీ మాత్రమే కాస్త బెటర్ అనిపించాయి. మిగిలిన సినిమాలు అయితే ఎప్పుడు వచ్చి వెళ్లాయి అనేది కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు శంకర్ దాదా MBBS మళ్లీ రిలీజ్ అవుతుంది.

4 / 7
నవంబర్ 4న ఈ సినిమా మళ్లీ విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అయితే గత ఏడాది చిరంజీవి నుంచి వచ్చిన ఘరానా మొగుడు.. ఈ ఏడాది గ్యాంగ్ లీడర్ సినిమాలు కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు.

5 / 7
ఇలాంటి సమయంలో అనవసరంగా చిరంజీవి పాత సినిమాలు మళ్ళీ విడుదల చేసి.. ఆయన క్రేజ్ పడిపోయేలా చేయొద్దు అంటున్నారు మెగా ఫాన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత సినిమాలు మళ్లీ విడుదల చేసిన కూడా చూసే సమయం ఎవరికీ లేదు. ఎందుకంటే ఒకవైపు వరల్డ్ కప్.. మరోవైపు రాజకీయాల బిజీ నడుస్తుంది. ఇలాంటి టైంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమా మళ్లీ రిలీజ్ చేయడం అనేది మంచి ఐడియానా కాదా అనేది అర్థం కావడం లేదు.

6 / 7
2004లో జయంత్ సి పరాన్జి తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ కామెడీగా నిలిచిపోయింది. దాంతో అదే మ్యాజిక్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తుంది అని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. దాన్ని బాగానే ముస్తాబు చూస్తున్నారు. అలాగే భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీపావళికి తెలుగు సినిమాలు విడుదల కావడం లేదు. అది అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు శంకర్ దాదా.

7 / 7
మరి అప్పటిలాగే ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయంటే ఈ పేరుతో మరికొన్ని పాత సినిమాలు విడుదల కావడం ఖాయం.