
మే 9న విశ్వంభర వస్తుందని ప్రచారం జరుగుతున్నా.. దానికి ముందే ఏదైనా రిలీజ్ డేట్ ఖాళీ అయితే అది తీసుకోవాలని చూస్తున్నారు చిరు. ఎప్రిల్ 10న రాజా సాబ్, 18న తేజ సజ్జా మిరాయ్‌లలో ఒకటి కచ్చితంగా వాయిదా పడనుందని.. ఆ డేట్‌కే విశ్వంభర రానుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

విశ్వంభర షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఈ సస్పెన్స్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు మెగాస్టార్. మెగాస్టార్ కెరీర్‌లో ఇంతవరకూ చేయని ఓ డిఫరెంట్ రోల్‌లో చిరును ప్రజెంట్ చేయబోతున్నాం అంటూ ఊరిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్.

దసరా తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న శ్రీకాంత్, ఆ గ్యాప్‌లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారు. ఆల్రెడీ చిరును కలిసి కథ కూడా వినిపించారు.

ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చిరు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న టాక్ వినిపిస్తోంది.తాజాగా ఈ లిస్ట్‌లో మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది. యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు చిరు ఓకే చెప్పారన్నది ఫిలిం నగర్‌లో నయా అప్‌డేట్.

ప్రజెంట్ ప్రభాస్ మూవీ పనుల్లో ఉన్న సందీప్, నెక్ట్స్ మెగాస్టార్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. చిరు నెక్ట్స్ సినిమాల దర్శకులంతా వీరాభిమానులే కావటంతో మరింత హైప్ క్రియేట్ చేస్తుందంటున్నారు ఫ్యాన్స్.