
తెలుగులో మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరంటే..

ఆమె మరెవరో కాదు.. తెలుగు అందాల తార నివేదా థామస్. నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుని కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ కొన్నాళ్లుగా ఈ అమ్మడుకు ఆఫర్స్ తగ్గిపోయాయి.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నివేదా.. ఇటీవల కొత్త లుక్ లో అభిమానులకు షాకిచ్చింది. అప్పట్లో సన్నజాజిలా కనిపించిన నివేదా.. ఇటీవలే బొద్దుగా మారిపోయింది. కొన్ని రోజులుగా 35 చిన్న కథ కాదు సినిమాతో థియేటర్లలో సందడి చేసింది.

ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించి.. అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం నివేదాకు సంబంధించిన క్రేజీ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో డ్రెస్ లో మతిపోగొట్టే అందంతో మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.