
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో కోలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తుంది.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్ షిఫ్ట్ అయిన ఆమె.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండిపోయింది.

అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఆమె.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే రాహుల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి 2006లో రూపిక అనే పాప జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి.. తెలుగులో వీర సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. అలాగే కథానాయికగానూ రీఎంట్రీ ఇస్తుంది. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న సుందరకాండ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు. నిత్యం యోగా, వ్యాయమం, వర్కవుట్స్ చేస్తూ ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీ పడడం లేదు.