
తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఫస్ట్ మూవీతోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో చేసింది రెండు చిత్రాలు మాత్రమే అయినా అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తనే రితికా సింగ్.

1994లో ముంబైలో జన్మించిన హీరోయిన్ రితికా సింగ్. కేవలం కథానాయిక మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. 2009లో భారతదేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2012లో ఇరుదుచుట్రు అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ సరనస గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో రితికా తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత రాఘవా లారెన్స్ నటించిన శివలింగ సినిమాలో నటించింది. అయితే నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన రితికా.. ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేదు. ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

ఇన్ కార్, పిచ్చకారెన్ 2, వనంగ ముడి, కొలై, కింగ్ ఆఫ్ కొత అనే సినిమాలతో అలరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న రితికా.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.