
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది. మొదటి సినిమాతోనే అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది.

ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలన్ని ప్లాప్. అయినా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్. నిత్యం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసే ఈ వయ్యారి ఇప్పుడు గుర్రపు స్వారీ చేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టండి.

ఆ హీరోయిన్ మరెవరో కాదండి. కేతిక శర్మ. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి జోడిగా నటించి మెప్పించింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమాలో నటించినప్పటికీ ఆ మూవీ నిరాశపరిచింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో నటించింది.

కానీ ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ నెట్టింట చాలా యాక్టివ్.