Buchibabu: జక్కన్నకు జై.. రాజమౌళి రూట్‎లో బుచ్చిబాబు పయనం..

Edited By: Prudvi Battula

Updated on: Apr 26, 2025 | 3:15 PM

సినిమా మేకింగ్‌లోనే కాదు ప్రమోషన్‌ విషయంలోనూ రాజమౌళిది సపరేట్‌ స్టైల్‌. హీరో క్యారెక్టర్‌ విషయంలో హింట్స్ ఇస్తూ ఆడియన్స్‌ను పిపేర్ చేయటం, మెయిన్‌ ట్విస్ట్‌లు తప్ప మిగతా కథ అంతా మ్యాగ్జిమమ్ రివీల్ చేస్తూ సినిమా మీద హైప్‌ పెంచేస్తారు. ఇప్పుడు ఎగ్జాట్‌ ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు ఓ యంగ్ డైరెక్టర్‌. రాజమౌళి స్టైల్‌లోనే తన అప్‌కమింగ్‌ సినిమా మీద హైప్‌ పెంచేస్తున్నారు.

1 / 5
ఉప్పెన్‌ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు, రెండో సినిమాతోనే గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. వింటేజ్‌ రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దితో మరో ప్రయోగం చేస్తున్నారు బుచ్చిబాబు.

2 / 5
ప్రమోషన్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్‌. సినిమా రిలీజ్‌కు ఏడాది ముందే టీజర్‌ రిలీజ్ చేసి హీరో క్యారెక్టరైజేషన్‌, రామ్ చరణ్ లుక్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

3 / 5
ఆ తరువాత కూడా ఛాన్స్ వచ్చిన ప్రతీసారి సినిమా గురించి హింట్స్ ఇస్తున్నారు. పెద్ది కథ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు బుచ్చిబాబు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు.

4 / 5
 కొవిడ్ టైమ్‌లోనే ఈ కథ రెడీ చేసుకున్నా అన్న దర్శకుడు, సుకుమార్ వల్లే రామ్ చరణ్‌కు కథ వినిపించే ఛాన్స్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. టీజర్‌లో సూపర్ సక్సెస్‌ అయిన క్రికెట్‌ షాట్‌ గురించి కూడా చెప్పారు బుచ్చిబాబు. 

5 / 5
ఆ షాట్‌ను ఫైట్‌ మాస్టర్ నవకాంత్ డిజైన్ చేశారని, క్రెడిట్ అంతా అతనికే దక్కాలన్నారు. రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.