
ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో మూవీ యూనివర్స్‌లు సందడి చేస్తున్నా, సూపర్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న యూనివర్స్ మాత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఒక్కటే. అందుకే ఆ సీరిస్‌లో అప్ కమింగ్ సినిమాల మీద ఆడియన్స్‌లో ఫోకస్ గట్టిగా కనిపిస్తోంది.

తాజాగా ఈ లైనప్‌లో రావాల్సిన ఓ మెగా ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి. అయినా.. దీంతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తీసుకువస్తోంది వైఆర్ఎఫ్ టీమ్. పఠాన్ రిలీజ్‌కు ముందే యష్ రాజ్ ఫిలింస్ నుంచి భారీ ప్రకటన వచ్చింది.

ఆల్రెడీ రిలీజ్ అయిన ఎక్తా టైగర్, టైగర్ జిందాహై, వార్ సినిమాలను ఒకే యూనివర్స్‌కు కిందకు తీసుకువస్తూ స్పై యూనివర్స్‌ను ఎనౌన్స్ చేసింది వైఆర్ఎఫ్. పఠాన్, టైగర్ 3 సినిమాలు కూడా ఆ యూనివర్స్‌లో భాగంగానే రిలీజ్ అయ్యాయి.

టైగర్ 3 రిలీజ్‌కు ముందు వార్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి భారీ యాక్షన్ మూవీస్‌ను ఎనౌన్స్ చేసింది వైఆర్ఎఫ్. కానీ ఆ సినిమా రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. టైగర్ 3కి అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రాకపోవటంతో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాను పక్కన పెట్టేసింది యూనిట్.

తాజాగా టైగర్ వర్సెస్ పఠాన్ స్థానంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ బ్లాక్ బస్టర్ పఠాన్‌కు సీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

చాలా రోజులుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న టీమ్, పఠాన్ ను మరిపించేలా సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధమవుతుందన్న హింట్ ఇచ్చింది. స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ వచ్చేయటంతో ఈ ఏడాదిలోనే పఠాన్ 2 ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉంది వైఆర్ఎఫ్ టీమ్.

డిసెంబర్‌లో సినిమాను స్టార్ట్ చేసి, 2026 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆల్ సెట్ అనుకుంటే మార్చి ఫస్ట్ వీక్‌లోనే పఠాన్ 2 అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా రానుంది.