
ఈ ఏడాది ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలు పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ సక్సెస్ అయ్యే సినిమాలు అవుతున్నాయి. అక్కడయ్యేవి అవుతున్నాయి.. అయితే మన దగ్గరతో పోల్చుకుంటే నార్త్ లో కాస్త భయపెట్టే ఎలిమెంట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది... రీసెంట్‌గా ప్రూవ్ అయిన సేమ్ ఫార్ములా నవంబర్‌లోనూ రిపీట్ అవుతుందా?

ఖాన్‌ల సినిమాలకు వచ్చే కలెక్షన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాకు రావడం ఏంటి? అని ఉత్తరాది వారు అవాక్కయ్యేలా చేసింది స్త్రీ2 ఫైనల్ నెంబర్. ఆ కథేంటి? ఆ కలెక్షన్లు ఏంటి అని అందరూ విస్తుపోయి చూశారు.

కెరీర్‌లో ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడూ పడుతుంటే ఆ కిక్కే వేరప్పా అంటూ ఆనందాన్ని పంచుకున్నారు శ్రద్ధాకపూర్. స్త్రీ2కి ప్లస్ అయిన ఆ భయపెట్టే ఎలిమెంట్ ఇప్పుడు నవంబర్‌లోనూ మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందా? ఆల్రెడీ మెప్పించిన సక్సెస్‌ఫుల్ కంటెంట్... విజయాన్ని కంటిన్యూ చేస్తుందా అనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి.

నా సింహాసనాన్ని అతనికి ఇవ్వడానికి మీకు ఎంత ధైర్యం.. ఎన్నిసార్లు ఈ సింహాసనాన్ని దూరం చేసినా.. ఇది నాకు మాత్రమే సొంతం.. అనే డైలాగులతో అట్రాక్ట్ చేస్తోంది భూల్ భులయ్యా 3 టీజర్.

నవంబర్ 1న రిలీజ్‌కి రెడీ అవుతోంది భూల్ భులయ్యా3. సెకండ్ హాఫ్‌లో ఆల్రెడీ స్త్రీ2తో సక్సెస్ చూసిన బాలీవుడ్‌కి, భూల్ భులయ్యా3 మరో హిట్‌ని ఖాయం చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ...