
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా కాకపోయినా స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటిగా, స్పెషల్ సాంగ్స్ లోనూ సందడి చేస్తోందీ అందాల తార

కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది సన్నీ లియోన్. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది సన్నీ.

సినిమాల సంగతి పక్కన పెడితే సన్నీకి సామాజిక స్పృహ ఎక్కువ. తన సొంత డబ్బులతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది.

సన్నీ లియోన్ పదేళ్ల క్రితం నిషిక అనే అమ్మాయిని దత్తత తీసుకుని గారాబంగా పెంచుకుంటోంది. తాజాగా తన కూతురి పదో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిందీ అందాల తార.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సన్నీ. కాగా నిషికను దత్తత తీసుకున్న తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందీ అందాల తార.