
గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన షారూక్ ఖాన్, ఓ సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోయినా... ఓ పాన్ ఇండియా హీరో కోసం గెస్ట్ రోల్ చేసేందుకు ఓకే చెప్పారు.

కేజీఎఫ్ సక్సెస్ తరువాత యష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం షారూఖ్‌ను సంప్రదించారు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. క్యారెక్టర్ నచ్చటంతో షారూఖ్ కూడా సౌత్ డెబ్యూ విషయంలో ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

సౌత్ సినిమాతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆ మధ్య చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన బచ్చన్ సాబ్, ప్రజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. తమిళ్‌లో రజనీకాంత్ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

సౌత్ రీమేక్స్‌తో బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుంటున్న అజయ్ దేవగన్ కూడా ఈ మధ్య ఓ సౌత్ సినిమాలో కనిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ట్రిపులార్‌లో గెస్ట్ రోల్ చేశారు ఏడీ.

సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ లాంటి స్టార్స్ అయితే ఏకంగా ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతూనే సౌత్ సినిమాలో విలన్ రోల్స్‌కు ఓకే చెబుతున్నారు.