
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది విష్ణుప్రియ. ఆతర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి పోరా పోవే షోతో యాంకర్ గా అరంగేట్రం చేసింది. ఈ షో విష్ణుప్రియకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

దీని తర్వాత పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేసిందీ అందాల యాంకరమ్మ. అలాగే ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు లోనూ సందడి చేసింది.

బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా తన అందం, ఆటతీరుతో బుల్లితెర అభిమానులను కట్టి పడేసింది విష్ణుప్రియ. దీని తర్వాత ఆమెకు బుల్లితెరపై మరింత క్రేజ్ వచ్చింది.

కాగా కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో యాక్ట్ చేసింది విష్ణుప్రియ. చెక్ మేట్, ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్ అనే సినిమాల్లో కథానాయికగా కనిపించిందీ అందాల యాంకరమ్మ.

లా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజి బిజీగా ఉండే విష్ణు ప్రియ తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్‌కు సమీపంలో ఉన్న ఈశా యోగా కేంద్రానికి వెళ్లింది. అక్కడ సద్గురు ఆశ్రమాన్ని దర్శించుకుంది

అలాగే ఆదియోగి విగ్రహం దగ్గర సరదాగా ఫొటోలు దిగింది విష్ణు ప్రియ. అనంతరం ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.