
బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అశ్విని శ్రీ ఒకరు. ఏడో సీజన్ లో వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆట, మాట తీరుతోనే కాకుండా అందంతోనూ ఆడియెన్స్ ను కవ్వించింది.

అయితే ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయిందీ అందాల తార. అయితేనేం ఈ రియాలిటీషోతో అశ్విని శ్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

బిగ్ బాస్ హౌస్ లోకి రాక ముందు పలు సినిమాల్లో నటించిందీ అందాల తార. పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో సహాయక నటిగా అలరించింది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అశ్విని శ్రీ హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్ర చేయడం విశేషం. ట్రైన్ సన్నివేశాల్లో అశ్విని శ్రీ బాగా హైలైట్ అయ్యింది.

ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అశ్విని శ్రీ గురువారం (జనవరి 22) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా తిరుమలలో భక్తులు అశ్విని శ్రీ తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. నటి కూడా ఎంతో ఓపికగా వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగింది.