
బిగ్బాస్ సీజన్ 6 ఫేమ్, టాలీవుడ్ హీరోయిన్ వాసంతి కృష్ణన్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు పవన్ కల్యాణ్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 21న ఈ వీరి వివాహం తిరుపతి వేదికగా జరిగింది. తాజాగా తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొత్త దంపతులు.

వాసంతి, పవన్ కల్యాణ్ ల పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు కొందరు బుల్లితెర ప్రముఖులు హాజరయ్యారు.

వివాహ వేడుక అనంతరం నేరుగా తిరుమలకు వెళ్లిపోయారీ నూతన దంపతులు. పెళ్లి బట్టల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తాజాగా తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది వాసంతి కృష్ణన్. దీంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే పెళ్లి వేడుకల్లో సమంతను ఫాలో అయినట్లుంది వాసంతి. సేమ్ సామ్ లాగే చీర, ఆభరణాలు ధరించి ముస్తాబైందీ అందాల తార. మొత్తానికి చూడముచ్చటైన జంట అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు