
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ప్రేమ వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ బ్యూటీతో సిరాజ్ ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ నడుస్తున్నాయి.

ఆమె మరెవరో కాదు.. హిందీ బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మ. ఆమెతో మహ్మద్ సిరాజ్ ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరు కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ఈ విషయాన్ని చాలా దగ్గరి సన్నిహితులు చెప్పినట్లు ఓ ఆంగ్ల సైట్ బయటపెట్టింది.

మహిరా చేసిన పోస్టుకు ఇన్ స్టాలో సిరాజ్ లైక్ కొట్టడంతోపాటు ఫాలో కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అందులో పేర్కొన్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది మహిరా శర్మ.

ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదని.. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదంటూ పేర్కొంది. అభిమానులు తనకు ఎవరితోనైనా రిలేషన్ షిప్ పెట్టగలరని.. ఇంతకు ముందు పనిచేసిన నటులతోనూ ఇలాంటి రూమర్స్ వచ్చినట్లు వెల్లడించింది.

అందుకే తన గురించి వచ్చే రూమర్స్ అసలు పట్టించుకోనని చెప్పుకొచ్చింది. తన కుమార్తె సెలబ్రెటీ అయినందుకే ఎవరితో మాట్లాడినా ఇటువంటి రూమర్స్ వస్తునే ఉంటాయని మహిరా శర్మ తల్లి అన్నారు.