- Telugu News Photo Gallery Cinema photos Actor Tanish Mem Vayasuku Vacham Movie Heroine Niti Taylor, Latest Photos Goes Viral
Tollywood: ఒక్క సినిమాతో టాలీవుడ్లో కనిపించకుండా పోయింది.. కట్ చేస్తే.. ఇప్పుడేమో భర్తతో ఇలా..
తెలుగు సినీపరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమా. యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.
Updated on: Mar 04, 2025 | 2:19 PM

తెలుగు యూత్ మెచ్చిన ప్రేమకథ చిత్రాల్లో మేం వయసుకు వచ్చాం ఒకటి. 2012లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తనీష్ హీరోగా నటించిన ఈ మూవీలో నితి టేలర్ కథానాయికగా కనిపించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది.

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మవీలో చూడచక్కని రూపం, అమాయకమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది.

దీంతో ఈ మూవీ తర్వాత నితి తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని అనుకున్నారంతా. కానీ అలా కాకుండా తెలుగులో ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. మేం వయసుకు వచ్చాం సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది.

కొన్ని రోజుల క్రితం నితి టేలర్ పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆమె తన భర్తతో విడిపోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. అందుకు కారణం ఆమె తన ఇన్ స్టా నుంచి భర్త, పెళ్లి ఫోటోస్ డిలీట్ చేయడమే. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.




