బిగ్‌బాస్ రియాల్టీ షోతో సూపర్ క్రేజ్ అందుకున్న ముద్దుగుమ్మల్లో దివి వైద్య ఒకరు. సీజన్ 4లో అడుగుపెట్టిన దివి.. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది.
కానీ తక్కువ సమయంలోనే బయటకు వచ్చేసింది. ఉన్నది తక్కువ వారాలే అయిన తన ఆట తీరుతో ఆకట్టుకుంది. అయినా ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తన కలువ కన్నులతో మాయ చేస్తోంది ఈ బ్యూటీ.
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ బ్యూటీ.. నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఇప్పుడు తన ఇన్ స్టాలో దివి షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పట్టు లంగావోణి విదేశీ వీధుల్లో ఫోటోషూట్స్ చేసింది దివి. అందులో ఎంతో చూడముచ్చటగా అందంగా కనిపిస్తుంది.
నీకోసం చీర కట్టుకుని రోడ్లు, గల్లీలు వెతికేస్తుంటే ఎక్కడున్నావ్ రా బాబు ? అంటూ సెర్చింగ్ ఎమోజీని షేర్ చేసింది దివి. అయితే దివి ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
2019లో మహర్షి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది దివి. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ.. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది.