
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ మహారాజా రవితేజ , హరి శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్ఛన్ మూవీతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా, ఈ అమ్మడుకు మాత్రం మంచి ఫేమ్ వచ్చింది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో ఈ బ్యూటీ తన అందం, గ్లామర్ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు తన అందంతో యూత్ ను తన వైపులాక్కుంది. దీంతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఎవరినోట విన్నా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత భాగ్య శ్రీ బోర్సేకు తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈబ్యూటీ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు అందాల ట్రీట్ ఇస్తుంటుంది.

తాజాగా ఈ చిన్నది మిర్రర్ ముందు బ్లాక్ అండ్ డ్రెస్ లో కప్ చేతిలో పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతే కాకుండా కైపెక్కిచ్చే విధంగా చూస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.