
అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

గీతా గోవిందం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని, వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా ఇలా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో లక్కీ హీరోయిన్ మారిపోయింది. కానీ రీసెంట్గా విడుదలైన సికిందర్ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

ఇక కాస్త ఫ్రీ టైమ్ దొరకడంతో ఈ ముద్దుగుమ్మ వెకేషన్ కు వెళ్లి ఏంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులో రష్మిక చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఇక నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.