
సంక్రాంతి సినిమాలకు ఇంకా 20 రోజులు కూడా టైమ్ లేదు. అందుకే ప్రమోషన్స్‌లో జోరు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు బాలయ్య. డాకూ మహరాజ్ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ రెడీ చేసి పెట్టారు నిర్మాత నాగవంశీ. మరి ఆయన ప్లాన్ ఏంటి..? ఏం చేస్తున్నారో చూద్దాం..

ఓ పద్దతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్.. ఇవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తున్నారు డాకూ మహరాజ్ నిర్మాత నాగవంశీ. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు.

మరీ ముఖ్యంగా ప్రమోషనల్ ఈవెంట్స్‌పైనా క్లారిటీ ఇచ్చారు. డాకు మహరాజ్ ప్రమోషన్స్ అన్ని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు మేకర్స్. జనవరి 2న ట్రైలర్ లాంఛ్.. 4న అమెరికాలో అక్కడి టైమింగ్స్ ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాక.. 8న ఆంధ్రాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అంతేకాదు.. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు దర్శకుడు బాబీ. 30 ఏళ్లలో నెవర్ బిఫోర్ బాలయ్యను చూపిస్తున్నామని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే టికెట్ రేట్ల ఇష్యూపైనా మాట్లాడారు నిర్మాత నాగవంశీ.

అమెరికా నుంచి దిల్ రాజు వచ్చాక.. ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారీయన. సంక్రాంతి సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ అక్కర్లేదన్నారు నాగవంశీ.