అఖండ 2 టీమ్ మరో అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ఓ పాత్రలో నటిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసింది యూనిట్.
సాండల్‌వుడ్ స్టార్ హీరో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించిన సుదీప్, ఆ అవార్డును మరొకరి ఇస్తే ఆనందిస్తానంటూ ట్వీట్ చేశారు.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ షో షూటింగ్ పూర్తయినట్టుగా వెల్లడించారు మేకర్స్. ఈ సిరీస్‌లో ఇదే కష్టమైన షూటింగ్ అన్నారు మేకర్స్. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ షోలో మనోజ్ బాజ్‌పాయ్, గుల్‌పనాగ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
టాక్సిక్ సినిమాలో నయనతార నటిస్తున్నారా లేదా అన్న విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఒబెరాయ్ ఈ విషయంలో అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను టాక్సిక్ షూటింగ్‌లో పాల్గొంటున్నానని, ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారని చెప్పారు అక్షయ్.
విజయ్ ఆఖరి చిత్రానికి సంబంధించి తొలి అప్‌డేట్‌కు ఇచ్చింది మూవీ టీమ్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు విజయ్ ఫస్ట్ మూవీ జన నయగాన్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రబృందం.