బాలనటిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తుంది కావ్య కళ్యాణ్ రామ్. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమాతో చైల్డ్ యాక్టర్ గా నటించిన కావ్య.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.
Kavya Kalyan Ram New మసూద సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన కావ్య.. ఫస్ట్ మూవీతోనే హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కావ్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. s
ఇక ఆ తర్వాత కావ్యకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. బలగం తర్వాత ఉస్తాద్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తన కొత్త సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్ లుక్స్ తెగ వైరలవుతున్నాయి.
స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఇక మోడ్రన్ డ్రెస్ లో గ్లామర్ స్టైల్ ఫోజులతో పిల్లి కళ్లతో మాయ చేస్తోంది కావ్య కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ స్టిల్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక కావ్యకు ఇన్ స్టాలో 3.61 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కావ్య లేటేస్ట్ ఫోటోషూట్ పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కావ్య ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ.. కిల్లర్ లుక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అలాగే కావ్య కొత్త సినిమా అప్డేట్స్ కావాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.