
ప్రస్తుతం ఓటీటీలో క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా. ? తెలుగు కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బకాసుర రెస్టారెంట్.

బకాసుర రెస్టారెంట్ సినిమా ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ మూవీ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఉద్యోగం చేస్తుంటాడు. కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బుల కోసం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మొదట దెయ్యం గురించి వీడియో చేస్తాడు.

ఆ వీడియో తెగ వైరలవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకు వస్తుంది. ఆ ఆత్మతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు.

పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ప్రవేశించిన ఆత్మకు ఆకలిగా ఎక్కువగా ఉంటుంది. దానిని బయటకు పంపించేందుకు పరమేశ్వర్ స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఏంటీ. ? చివరకు ఏం జరిగిందనేది కథ.