
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు కథానాయికగా రాణిస్తుంది. తెలుగులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో ప్రేక్షకులను అలరిస్తుంది.

బేబీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవి.. ఈసినిమాలో అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉండిపోయింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తన కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ అత్యంత గ్రాండ్ గా జరుపుకుంది వైష్ణవి. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది. అందులో చీరకట్టులో సింపుల్ లుక్ తో మరింత అందంగా కనిపిస్తుంది. చిచ్చుబుడ్డి వెలుగుల్లో వెన్నెలమ్మలా మెరిసిపోతుంది వైష్ణవి.

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన బేబీ సినిమా ఏ స్థాయిలో హిట్టైయిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడి రిపీట్ కాబోతుండడంతో సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రానికి 90s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కొన్నాళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. మరోవైపు తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది వైష్ణవి.