UNstoppable 4: బాలయ్య ఎనర్జీకి సూర్య ఫిదా.! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులకు బ్రేక్..
ఆరు పదుల వయసులో ఆయన డిసిప్లిన్, డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా అంటూ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పారు నడిప్పిన్ నాయగన్ సూర్య. అన్‌స్టాపబుల్ షో కోసం బాలయ్యతో ముచ్చటించారు సూర్య.. కంగువ గురించి బాలయ్య గురించి చాలా విషయాలు పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 కోసం ఎదురుచూపులు మామూలుగా లేవు. అక్టోబర్ 25 రాత్రి 8.30 ఎప్పుడెప్పుడు అవుతుందా? ఫస్ట్ పార్టులో ఏమేం విషయాలుంటాయా?