Pushpa 2 Collections: ఆరు రోజుల్లోనే పుష్ప 2 ప్రభంజనం.. ఏ సినిమా ఎన్ని రోజుల్లో వెయ్యి కోట్లు రాబట్టాయో తెలుసా?

|

Dec 12, 2024 | 12:09 PM

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇప్పుడు పుష్ప 2 ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

1 / 7
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డ్ సృష్టించింది.

2 / 7
ఇప్పటివరకు ఈ రికార్డ్ కేవలం ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమాపైనే ఉండేది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

3 / 7
ఆ తర్వాత జక్కన్న రూపొందించిన ఆర్ఆర్ఆర్ రెండవ స్థానంలో ఉండేది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కేవలం 16 రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించారు.

4 / 7
ఇక పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా కేజీఎఫ్ 2. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టింది.

5 / 7
ఇక ఆ తర్వాతి స్థానంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం నిలిచింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన 16 రోజుల్లో రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

6 / 7
ఆ తర్వాత రెండు రికార్డులు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్నాయి. ఈ హీరో నటించిన జవాన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన 18 రోజుల్లో రూ.1000 కోట్లు రాబట్టింది.

7 / 7
అంతకు ముందు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం సైతం 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. షారుఖ్, దీపిక పదుకొణె జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన 27 రోజుల్లో వెయ్యి కోట్లు రాబట్టింది.